LOADING...
Siddaramaiah: కర్ణాటక తదుపరి సీఎంగా డీకేను ప్రతిపాదించిన సిద్ధూ..!
కర్ణాటక తదుపరి సీఎంగా డీకేను ప్రతిపాదించిన సిద్ధూ..!

Siddaramaiah: కర్ణాటక తదుపరి సీఎంగా డీకేను ప్రతిపాదించిన సిద్ధూ..!

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2026
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో నాయకత్వ మార్పు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ బాధ్యతలు చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సిద్ధరామయ్య స్వయంగా పదవి నుంచి తప్పుకునే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గురువారం ఉదయం తన నివాసంలో రాష్ట్ర మంత్రులతో సిద్ధరామయ్య అల్పాహార సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ పేరును ఆయన ప్రతిపాదించినట్లు రాష్ట్ర మంత్రి హెచ్‌కే పాటిల్‌ వెల్లడించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సిద్ధరామయ్య మధ్యాహ్నం రాజీనామా చేయనున్నారని తెలిపారు.

వివరాలు 

కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం జరిగే అవకాశం

కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కూడా హెచ్‌కే పాటిల్‌ స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం కూడా ఈ మార్పుపై ఇప్పటికే అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సిద్ధరామయ్య రాజీనామాపై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఆయన లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలవనున్నారు. అనంతరం తన రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు వెల్లడించింది. రాజీనామా అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై సిద్ధరామయ్య తన నివాసంలో మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం.

Advertisement