తదుపరి వార్తా కథనం

Trains: ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్స్ సమస్య.. నిలిచిపోయిన రైళ్లు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 08, 2024
11:47 am
ఈ వార్తాకథనం ఏంటి
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్స్ సమస్య కారణంగా భారీ అవాంతరాలు చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్ నుంచి నాగ్‌పుర్ వెళ్లే వందే భారత్, దిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు అరగంట పాటు నిలిచిపోయాయి.
రైల్వే అధికారులు సిగ్నల్స్ సమస్యను పరిష్కరించిన తర్వాత రైళ్లను స్టేషన్ నుంచి పంపించారు.
Details
20 నిమిషాలు అగిపోయిన సింగరేణి ప్యాసింజర్
ఇక, ఉప్పల్ స్టేషన్‌లో సింగరేణి ప్యాసింజర్ 20 నిమిషాలపాటు ఆగిపోయింది.
గూడ్స్ రైలు కూడా మెయిన్‌లైన్‌లో నిలిచిపోయింది. ఈ సిగ్నల్స్ సమస్య కారణంగా ఉప్పల్ ఆర్వోబీ సమీపంలోని రైల్వే గేటు కూడా తెరుచుకోకపోవడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
రైల్వే అధికారులు సమస్యను తొందరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.