Rajasthan: పోషకాలు,యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బహుళ వర్ణ మొక్కజొన్న
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాకు చెందిన పిప్రాలీ గ్రామం విస్తృతమైన సారవంతమైన భూములు, సాగుకి అనుకూలమైన వాతావరణం వల్ల ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో రైతుగా ఉన్న సంజయ్ యాదవ్ తన వ్యవసాయ ప్రస్థానాన్ని కొత్త ఆవిష్కరణలతో ముందుకు తీసుకెళ్లడం వలన పిప్రాలీ పేరు రాష్ట్రంలో మరోసారి వినిపిస్తోంది. పది సంవత్సరాలకు పైగా సాగులో అనుభవం ఉన్న సంజయ్ రసాయన ఎరువులపై ఆధారపడకుండా, సహజ ప్రకృతి పద్ధతులనుసరించి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఫతేపుర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పొందిన శిక్షణ ద్వారా సంజయ్ మొక్కజొన్నలోని వివిధ రకాలను మిళితం చేసి సంకరజాతి విత్తనాలను తయారుచేశారు.
వివరాలు
మొక్కజొన్నకు పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు
ఫలితంగా, పలు రంగులలో మొక్కజొన్నను పండించడం సాధ్యమైంది. ఈ మక్కలు భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపించడమే కాదు.. యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు వీటిలో మెండుగా ఉన్నాయి. దిగుబడిని నేరుగా మార్కెట్లో విక్రయించడం వలన రెట్టింపు లాభాలు పొందిన సంజయ్ ఇప్పుడు ఈ రకమైన మొక్కజొన్నకు పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశారు. అదేవిధంగా, సంజయ్ సేంద్రియ పద్ధతిలో పండించిన ఎర్ర ముల్లంగి కూడా మార్కెట్లో మంచి ధర పొందుతోంది. చుట్టుపక్కల రైతులందరూ ఇప్పుడు ఆయన పద్ధతిని అనుసరించడంలో ఆసక్తి చూపిస్తున్నారు. సంజయ్ ప్రకారం, సాగులో కొత్త సాంకేతికతలను అనుసరించి విత్తనాలు తయారుచేస్తే, మధ్యవర్తి వ్యవస్థకు నిర్బంధం లేకుండా రైతులు నేరుగా లాభాలు పొందగలరు.