Prem Singh Tamang: ఒకప్పుడు, బడి పంతులు ఇప్పుడు సిక్కిం సీఎం
ప్రేమ్ సింగ్ తమాంగ్ 1968 ఫిబ్రవరి ఐదో తారీఖున. ఖలు సింగ్ తమాంగ్ , ధన్ మాయ తమంగ్ అనే నేపాలీ దంపతులకు జన్మించారు. అయన పశ్చిమ సిక్కింకి చెందిన వాడు. డార్జీలింగ్ గవర్నమెంట్ కళాశాల నుండి 1988 సంవత్సరంలో BA పట్టా పొందారు.తన చదువు పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నడిపే ఒక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఈయన కుమారుడు ఆదిత్య తమాంగ్ కూడా రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుడు.1990లో కేంద్ర మానవ వనరుల శాఖ కింద సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం తమాంగ్‌ను ఉపాధ్యాయ పదవిలో నియమించింది.
ప్రేమ్ సింగ్ ఎలా ఎదిగారు
ఆ తర్వాత సామాజిక రాజకీయాల పట్ల ఆయనకు మక్కువ కలిగింది. దీంతో తన ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి రాజకీయ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం మొదలుపెట్టారు. తన రాజకీయ జీవితం మొదట్లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ తో కలిసి పశ్చిమ సిక్కిం జిల్లాలో చురుగ్గా పాల్గొనేవారు. 1994లో మొట్టమొదటిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ లో ఉన్నప్పుడు రాష్ట్ర యువజన సంఘానికి కన్వీనర్ గా కొనసాగారు. దాంతో పాటుగా వైస్ ప్రెసిడెంట్ గా పని చేశారు.
2019లో ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
2019 సిక్కిం సాధారణ ఎన్నికల్లో 32 అసెంబ్లీ స్థానాలకు గాను 17 స్థానాల్లో గెలుపొందింది. సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ అప్పటివరకు ఇరవై నాలుగు సంవత్సరాల పాలనలో ఉన్న పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ పై ఆధిక్యం సాధించింది. 2019 మే 24న సిక్కిం రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా గోలేని మోర్చా పార్టీ ఎన్నుకోవాలని దాదాపుగా నిశ్చయించారు. అయితే ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల వుండటంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.ఆ తర్వాత 2019 మే 27న ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు[