MLA Jonnalagadda Padmavathi: ఎస్సీ మహిళ అంటే అంత చిన్న చూపా.. సొంత పార్టీ పైన వైసీపీ ఎమ్మెల్యే ఫైర్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీ తన ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ దాదాపు ఖరారు చేసింది. 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వారి స్థానాల్లో కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వై.ఎస్.జగన్ ఎమ్మెల్యే టిక్కెట్లు నిరాకరించారు. ఇదే సమయంలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి హాట్ కామెంట్స్ ఇప్పుడు కొత్త చర్చకు దారి తీశాయి. గత కొన్నాళ్లుగా వైసీపీలో యాక్టివ్‌గా ఉన్న సింగనమల(ఎస్సీ రిజర్వ్‌డ్) ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఈరోజు ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చి ఫైర్ అయ్యారు. తాను ఎస్సీ మహిళా ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదురుకుంటునాన్ని అన్నారు.
వైసీపీలో గౌరవం లేదు: పద్మావతి
తనలాంటి ఎస్సీ మహిళకు వ్యతిరేకంగా ఉన్న కొద్దిమంది అధికార దాహంతో నా నియోజకవర్గానికి నీటి ప్రాజెక్టులు కూడా తేలేకపోతున్నాను. ఎమ్మెల్యేగా ఏమీ చేయలేకపోయానని.. శింగనమల నియోజకవర్గ ప్రజలు తనను క్షమించాలని కోరారు. తనకు వైసీపీలో గౌరవం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.జగన్ సన్నిహితుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం రాజకీయాల్లోకి వచ్చి తన పనిలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ అభ్యర్థులపై జరుగుతున్న వివక్షపై పోరాటం చేస్తానని పద్మావతి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించడం లేదని సీఎం చెప్పారన్నారు.టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని అభ్యర్ధించినా..అటువైపు నుంచి ఏ మాత్రం స్పందన లేదని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే వైసీపీకి మరో వికెట్ పడటం ఖాయంగా కనిపిస్తోంది.