LOADING...
Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2025
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏర్పాటు చేసిన 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో మొత్తం రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదం ఇచ్చినట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో ఐటీ, ఇంధన రంగాలు, పర్యాటకం, ఏరోస్పేస్, ఆహార ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 30కు పైగా కొత్త ప్రాజెక్టుల ఆమోదం పొందింది. వీటి ద్వారా సుమారుగా 67,000 కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా. ఎప్పుడూ లేని విధంగా అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపింది. రూ.87,520 కోట్లు పెట్టుబడి పెట్టనున్న రైడెన్‌ ఇన్ఫోటెక్‌ డేటా సెంటర్‌కు ఆమోదించింది. రైడెన్‌ ఇన్‌ఫోటెక్‌ డేటా సెంటర్ ఏర్పాటును అతి పెద్ద ఘనతగా SIPB భావిస్తోంది.

వివరాలు 

15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి: చంద్రబాబు 

SIPB ఈ డేటా సెంటర్ ఏర్పాటు కార్యక్రమాన్ని అత్యంత గొప్ప ఘనతగా, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి గేమ్-ఛేంజర్ గా గుర్తించింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు ముఖ్యమంత్రి, మంత్రులు అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి అత్యధిక విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన పాత్రను ప్రశంసించారు. 15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు

వివరాలు 

6.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం

3గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరిగింది. పెద్ద ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించేందుకు నిర్ణయించింది. వీరు ప్రాజెక్టుల క్రమంగా, నేరుగా అమలు కోసం బాధ్యతలు చేపడతారు. గతంలో జరిగిన SIPB సమావేశాల ఫలితంగా ఇప్పటివరకు రూ. 7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందని, ఇవి సుమారు 6.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం