Page Loader
Chandrababu: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. 19 సంస్థల ప్రతిపాదనలపై చర్చ 
ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. 19 సంస్థల ప్రతిపాదనలపై చర్చ

Chandrababu: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. 19 సంస్థల ప్రతిపాదనలపై చర్చ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్‌, టీజీ భరత్‌, వాసంశెట్టి సుభాష్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కేఎస్‌ విజయానంద్‌ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేశ్‌, అనగాని సత్యప్రసాద్‌, బీసీ జనార్దన్‌రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో మొత్తం 19 కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. మొత్తం రూ.28,546 కోట్ల విలువైన పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 30,270 మందికి నేరుగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని అంచనా వేయబడింది. ఈ ప్రతిపాదనలు అన్ని ఎస్ఐపీబీ ముందు పరిశీలనకు వచ్చాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రబాబునాయుడు అధ్యక్షతన SIPB సమావేశం