Page Loader
YS Sharmila: కాంగ్రెస్‌లో షర్మిల చేరికకు రంగం సిద్ధం.. ఏపీలో కీలక బాధ్యతలు 
YS Sharmila: కాంగ్రెస్‌లో షర్మిల చేరికకు రంగం సిద్ధం.. ఏపీలో కీలక బాధ్యతలు

YS Sharmila: కాంగ్రెస్‌లో షర్మిల చేరికకు రంగం సిద్ధం.. ఏపీలో కీలక బాధ్యతలు 

వ్రాసిన వారు Stalin
Jan 02, 2024
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ వారంలోనే ఆమె కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌లో కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలు వస్తున్న సమయంలో ఏపీలో షర్మిలను రంగంలోకి దించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేయడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిసింది. వైఎస్సార్‌సీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నవారు ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ తన ప్రభావాన్ని నిలుపుకోవడానికి కష్టపడుతున్న తరుణంలో షర్మిల ఏపీలో యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావడం ఆసక్తికరంగా మారింది.

ఏపీ

2012లో యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చిన షర్మిల

వైఎస్ షర్మిల 2012లో యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చారు. వైఎస్ జగన్ జైలులోకి వెళ్లిన తర్వాత షర్మిల ఓదార్పు యాత్రతో అందరి దృష్టిని ఆకర్షించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ పోషించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపునకు షర్మిల కీలకంగా వ్యవహరించారు. 2021లో షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్‌తో రాజకీయ విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆమె ఏపీని వదిలి తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీని షర్మిల వ్యవహరించారు.