Page Loader
మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి
కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి

మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి

వ్రాసిన వారు Stalin
Feb 20, 2023
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో గతేడాది అక్టోబర్ 30న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 135 మంది మృతిన ఈ ఘటనపై విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుజరాత్ హైకోర్టుకు సోమవారం నివేదికను సమర్పించింది. బ్రిటీష్ కాలం నాటి ఈ వంతెన కూలిపోవడానికంటే ముందే ఒక ప్రధాన తీగలోని సగం వైర్లు తుప్పు పట్టి, విరిగిపోయినట్లు సిట్ తన నివేదికలో వెల్లడించింది. సివిక్ బాడీ జనరల్ బోర్డు ఆమోదం లేకుండా ఒరెవా గ్రూప్‌తో మెయింటెనెన్స్ ఒప్పందంపై సంతకం చేసినందుకు మోర్బి మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్‌సిన్హ్ జాలా పేరును నివేదికలో చేర్చింది. ప్రజలు వంతెనను పాడుచేయకుండా నిరోధించడానికి తగినంత భద్రత లేదని సిట్ పేర్కొంది.

గుజరాత్

వంతెన పునఃప్రారంభానికి ముందు ఎలాంటి తనిఖీలు చేయలేదు: సిట్

కూలిపోయే సమయంలో వంతెనపై దాదాపు 300మంది వ్యక్తులు ఉన్నారని, ఇది వంతెన సామర్థ్యం కంటే చాలా ఎక్కువని సిట్ అధికారులు చెప్పారు. విక్రయించిన టిక్కెట్‌ల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేనందున ఒకేసారి అంతమంది వంతెనపైకి వచ్చినట్లు పేర్కొన్నారు. వంతెన ప్లాట్ ఫార్‌మ్ ఉన్న చెక్కలను తొలగించి, అల్యూమినియం ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల వంతెన బరువు పెరిగి, అది కూలిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా సిట్ పేర్కొంది. వంతెనకు పునఃప్రారంభానికి ముందు ఎలాంటి తనిఖీలు చేయలేని వివరించింది. నిర్మాణ వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేని అజంతా గోడ గడియారాలు, ఈ-బైక్‌ల తయారీదారు ఒరేవా గ్రూప్‌కు గత ఏడాది మార్చిలో 15 సంవత్సరాల కాలానికి మోర్బీ వంతెన మరమ్మతుల పనులను మున్సిపాలిటీ అప్పగించింది.