Page Loader
Sitaram Yechury: సీపీఎం నేత సీతారాం ఏచూరి పరిస్థితి విషమం..  ఢిల్లీ ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స 
సీపీఎం నేత సీతారాం ఏచూరి పరిస్థితి విషమం

Sitaram Yechury: సీపీఎం నేత సీతారాం ఏచూరి పరిస్థితి విషమం..  ఢిల్లీ ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 06, 2024
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

సీపీఐ(ఎం)ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని సమాచారం. శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. తాజాగా, ఆయనను ఐసీయూకి తరలించి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. తొలుత ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించిన తరువాత,పరిస్థితి విషమించడంతో ఐసీయూకి మార్చారు. ఆయన ఆరోగ్యంపై ఎయిమ్స్ సీనియర్ వైద్యుల బృందం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తోంది. సీతారాం ఏచూరి(72)గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే ఈ సమస్యల కారణంగా ఆయన కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నారు.అప్పటి నుంచి బయట ఎక్కువగా కనిపించలేదు. ఎయిమ్స్‌లో చేరిన తరువాత,బుద్ధదేవ్ భట్టాచార్య స్మారక సభకు హాజరుకావాలని భావించినా, అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోయారు.