LOADING...
Khajana Jewellers: చందానగర్ ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో ఆరుగురి అరెస్ట్‌
చందానగర్ ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో ఆరుగురి అరెస్ట్‌

Khajana Jewellers: చందానగర్ ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో ఆరుగురి అరెస్ట్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 13, 2025
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ చందానగర్‌లో సంచలనం రేపిన ఖజానా జువెలర్స్‌ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. పటాన్‌ చెరు రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా, సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని పట్టుకున్నారు. ఇద్దరు బైక్‌లపై పారిపోతున్న వీరిని పోలీసులు వెంటాడి అరెస్ట్‌ చేశారు. ముఖాలకు మాస్కులు, తలకు క్యాప్‌లు, చేతులకు గ్లౌజులు ధరించి ప్రయాణించడం పోలీసుల అనుమానాలకు కారణమైంది. వారు వినియోగిస్తున్న బైక్‌లు కూడా దొంగిలించినవేనని దర్యాప్తులో బయటపడింది. ఈ ఆరుగురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, వారిపై కేసు నమోదు చేశారు. దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.