Page Loader
Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆ కంపెనీ డైరెక్టర్‎కు బెయిల్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం

Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆ కంపెనీ డైరెక్టర్‎కు బెయిల్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 07, 2023
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ మేరకు ఈ కేసులో మరో నిందితుడికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే సీమెన్స్ ఇండియా కంపెనీ డైరెక్టర్ గంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్ కు యాంటిసిపేటరీ బెయిల్ జారీ చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్(Interim Bail)ను పూర్తి స్థాయి బెయిల్ గా మారుస్తూ జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులో సత్యభాస్కర్ A-35గా కొనసాగారు. తొలుత సత్యభాస్కర్ ను సీఐడీ అరెస్ట్ చేసి, విజయవాడలోని ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచింది.

details

హైకోర్టులో చుక్కెదురు కావడంతో సుప్రీంను ఆశ్రయించిన సత్య భాస్కర్

పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు నిందితుడికి అవినీతి నిరోధక చట్టం వర్తించదన్న కోర్టు రిమాండ్ విధింపునకు తిరస్కరించింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును సీఐడీ ఆశ్రయించింది. దీంతో ఏసీబీ కోర్టు ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ సత్య భాస్కర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు జడ్జి జస్టిస్ సురేశ్ రెడ్డి నిరాకరించారు. ఫలితంగా సత్యభాస్కర్ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆగస్టు 22న మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం, తాజాగా పూర్తి స్థాయి బెయిల్ మంజూరీ చేసింది.