LOADING...
SLBC: ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో కీలక ముందడుగు 
ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో కీలక ముందడుగు

SLBC: ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో కీలక ముందడుగు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2025
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో సహాయక చర్యల్లో కీలక ముందడుగు పడింది. ఇటీవల 14వ కిలోమీటర్‌ వద్ద సొరంగం పైకప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో 8 మంది సిబ్బంది చిక్కుకుపోయారు. ఈ ప్రమాదం జరిగిన 11 రోజులకు టన్నెల్‌లోని కన్వేయర్‌ బెల్ట్‌ను సాంకేతిక నిపుణులు పునరుద్ధరించారు. కన్వేయర్‌ బెల్ట్‌ పనిచేయడం ప్రారంభమవడంతో బురద, మట్టి తొలగింపు కార్యకలాపాలు వేగంగా కొనసాగనున్నాయి. సుమారు 200 అడుగుల మేర పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, సెగ్మెంట్, టీబీఎం శిథిలాలు కారణంగా ఇప్పటి వరకు ఆ 8 మంది జాడను గుర్తించడం సాధ్యపడలేదు. అధికారులు అంచనా ప్రకారం, దాదాపు 6,000 క్యూబిక్‌ మీటర్ల పూడికను పూర్తిగా తొలగించాల్సి ఉంది.