LOADING...
SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ముమ్మరంగా సహాయక చర్యలు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ముమ్మరంగా సహాయక చర్యలు

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ముమ్మరంగా సహాయక చర్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2025
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 11 కి.మీ వరకు లోకో ట్రైన్‌ ద్వారా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముందుకెళ్లాయి. అక్కడి నుంచి 3 అడుగుల మేర నీరు నిలిచింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 11 కి.మీ నుంచి 14 కి.మీ వరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నడుచుకుంటూ వెళ్లారు. సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్‌ మిషన్ (టీబీఎం) వద్దకు చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో టీబీఎం వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు నిర్ధారణైంది.

Details

బాధితులను రక్షించే దిశగా చర్యలు

అలాగే టన్నెల్ బోరింగ్ మిషన్ రెండు వైపులా మట్టి, బురద పూర్తిగా నిండిపోయాయి. ప్రమాద సమయంలో టీబీఎం 80 మీటర్ల వెనుకకు వెళ్లినట్లు సంబంధిత ఏజెన్సీ వెల్లడించింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఎంతో కష్టపడి టీబీఎం ముందు వైపునకు చేరుకున్నాయి. అయితే నీరు, మట్టి, బురద పూర్తిగా తొలగించేంత వరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి కొనసాగుతోంది. సహాయక చర్యలను వేగవంతంగా కొనసాగిస్తూ, బాధితులను రక్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.