LOADING...
SLBC: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీల ఆచూకీ ఇంకా తెలియలేదు!
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీల ఆచూకీ ఇంకా తెలియలేదు!

SLBC: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీల ఆచూకీ ఇంకా తెలియలేదు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2025
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 8 గంటలైనా, ఇప్పటికీ 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఘటనా స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీలు, బురదలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. సహాయక చర్యల్లో వేగం పెంచేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా రంగంలోకి దించుతున్నట్లు మంత్రులు ఉత్తమ్, జూపల్లి తెలిపారు.

Details

ఇద్దరు అమెరికన్ కంపెనీ ఇంజనీర్లు ఉన్నట్లు సమాచారం

అదనంగా భారత సైన్యం, రెస్క్యూ టీమ్ సహాయాన్ని కూడా కోరినట్లు వెల్లడించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా రక్షణ చర్యలు ప్రారంభించగా, లోపలికి మట్టి, నీరు చేరి 8 మీటర్ల మేర మార్గాన్ని మూసివేసినట్లు తెలిపారు. ప్రమాదంలో ఇద్దరు అమెరికన్ కంపెనీ ఇంజనీర్లు ఉన్నట్లు సమాచారం. అలాగే ఆరుగురు జయప్రకాష్ అసోషియేట్స్ ఉద్యోగులు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నారని తెలుస్తోంది. అయితే, గల్లంతైన రాబిన్స్ కంపెనీ ఉద్యోగులు అమెరికన్లా, ఇండియన్లా? అన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు.

Details

ప్రమాదం ఎలా జరిగింది? 

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ఈ రోజు ఉదయం 8:30 గంటల సమయంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్ పైకప్పు మూడుమీటర్ల మేర కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ ప్రాంతంలో ఎడమ వైపు టన్నెల్ పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో ప్రాజెక్టు పరిసరాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.