
Smart Ration Cards: రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రైస్ కార్డులు.. నేటి నుంచి పంపిణీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డులను ఆధునికంగా మార్చి, వాటి స్థానంలో 'స్మార్ట్ రైస్ కార్డులను' అందించేందుకు చర్యలు ప్రారంభించింది. ఇవాళ్టి నుంచే ఈ పంపిణీ కార్యక్రమం మొదలవుతోంది. ఉదయం 10:30 గంటలకు ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ ఈస్ట్‌లోని వరలక్ష్మీనగర్‌లో మొదటి విడత ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరు నియోజకవర్గాల్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు.
Details
నాలుగు విడతల్లో పంపిణీ
మొత్తం నాలుగు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి 45 లక్షల మందికి స్మార్ట్ రైస్ కార్డులు అందించనున్నారు. మొదటి విడత : నేటి నుంచి 9 జిల్లాల్లో పంపిణీ మొదలు - విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా. రెండో విడత : ఈ నెల 30వ తేదీ నుంచి 4 జిల్లాల్లో ప్రారంభం - చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు.
Details
గ్రామ సచివాలయాల ద్వారా అందజేత
మూడో విడత : వచ్చే నెల 6 నుంచి 5 జిల్లాల్లో పంపిణీ - అనంతపురం, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి. నాలుగో విడత : వచ్చే నెల 15 నుంచి 8 జిల్లాల్లో కార్యక్రమం - బాపట్ల, పలనాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం. గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా ఈ పంపిణీ జరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.