Covid Cases: కొత్తగా 774 మందికి కరోనా.. 600 మార్కును దాటిన JN.1 వేరియంట్ కేసులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 కేసులు భారీ పెరుగుతున్నాయి. ఫలితంగా ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 774 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
తాజాగా ఇద్దరు చనిపోయారు. అందులో గుజరాత్, తమిళనాడులో ఒకరు చొప్పున వైరస్ కారణంగా మరణించారు.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,187కు పెరిగింది. 2020లో కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసు సంఖ్య 4,50,17,431కి చేరుకుంది.
యాక్టివ్ కేసుల్లో దక్షిణ భారతదేశం నుంచి అత్యధికంగా ఉన్నాయి.
వీటిలో కర్ణాటకలో 1169, కేరళలో 1160, తమిళనాడులో 188, మహారాష్ట్రలో 931 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కరోనా
619కు చేరిన JN.1 సబ్-వేరియంట్ కేసుల సంఖ్య
కరోనా JN.1 సబ్ వేరియంట్ కేసులు కూడా భారీగా పెరుతున్నాయి.
జనవరి 4 వరకు 12 రాష్ట్రాల్లో JN.1 వేరియంట్ గుర్తించినట్లు కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 కేసుల సంఖ్య 619కి పెరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి.
కర్ణాటకలో 199, కేరళలో 148, మహారాష్ట్రలో 110, గోవాలో 47, గుజరాత్‌లో 36, ఆంధ్రప్రదేశ్‌లో 30, తమిళనాడులో 26, దిల్లీలో 15, రాజస్థాన్‌లో 4, తెలంగాణలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.
JN.1 వేరియంట్ వ్యాప్తి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది.