Kangana Ranaut FIR: గాంధీ కుటుంబంపై సోషల్ మీడియా పోస్టులు.. కంగనా రనౌత్‌పై కేసు నమోదు!
ఈ వార్తాకథనం ఏంటి
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ వ్యవహారంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని పోలీసులు కంగనాపై కేసు నమోదు చేశారు. శిమ్లాకు చెందిన రిటైర్డ్ కెప్టెన్ అతుల్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఇందిరా, సంజయ్, రాజీవ్ గాంధీలపై వ్యాఖ్యలు
నవంబరు 10న కంగనా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని పోస్టులు షేర్ చేశారని అతుల్ శర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఆమె కుమారులు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీల మరణాలపై కంగనా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
అలాగే కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని 'మిస్టీరియస్ ఫారిన్ నేషనల్'గా అభివర్ణిస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.
సంజయ్ గాంధీ మరణం తర్వాత మేనకా గాంధీని కుటుంబ నివాసం నుంచి బయటకు పంపించారంటూ చేసిన వ్యాఖ్యలను కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించారు.
వివరాలు
ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు ఉన్నాయని ఆరోపణ
కంగనా చేసిన పోస్టులు కేవలం రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కాలేదని అతుల్ శర్మ ఆరోపించారు.
ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా, ఈ కేసు వ్యవహారంపై కంగనా రనౌత్ ఇప్పటివరకు స్పందించలేదు.