Andhra Pradesh: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక అయ్యిన శ్రీకాళహస్తి టీచర్
తిరుపతి జిల్లా ఉపాధ్యాయుడు సురేశ్‌కు అరుదైన గౌరవం లభించింది. శ్రీకాళహస్తి రూరల్ మండలం ఊరందూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్రం అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్న సురేశ్, తన ప్రత్యేకమైన విద్యా పద్ధతుల వల్ల జాతీయ స్థాయి గుర్తింపును పొందాడు. విద్యార్థులకు వివిధ దేశాల మ్యాప్‌లు, చిత్ర పటాలు అందించడం, డిజిటల్ కంటెంట్‌లను రూపొందించడం ద్వారా విద్యా రంగంలో చేసిన సేవలకుగాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిడి అవార్డు దక్కింది. సురేశ్,సాంఘిక శాస్త్రంపై విద్యార్థులకు అవగాహన కల్పించి,ఆయా విషయాలను సులభంగా అర్థమయ్యేలా మార్చడంలో కృషి చేశాడు. డిజిటల్ మొబైల్ యాప్‌లను రూపొందించి,విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో ఉంచాడు. సొంతగ్రామంలో పేద పిల్లలకు విద్యపై అవగాహన కల్పించడం,వారికి ఉన్నత చదువుల అవకాశాలను అందించడం కోసం జాగ్రత్తలు తీసుకున్నాడు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు
సురేశ్, రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్శన్‌గా పని చేశాడు. ఎన్నో డిజిటల్ మ్యాప్‌లను రూపొందించి ఉపాధ్యాయులకు అందించాడు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు ఎంపిక చేశారు. సెప్టెంబర్ 5న డిల్లీలో జరిగే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుంటున్నారు. సురేశ్ ఎన్నో కేంద్ర,రాష్ట్ర స్థాయి అవార్డులు పొందాడు.వాటిలో జాతీయ ఉత్తమ ఐసిటి ఉపాధ్యాయ అవార్డు,ఆంధ్ర రత్న అవార్డు,గ్లోబల్ బెస్ట్ టీచర్ అవార్డు, ప్రావిణ్య ఫౌండేషన్ ప్రత్యేక గుర్తింపు అవార్డు ఉన్నాయి. సురేశ్ తన కృషి మీదే నమ్మకంతో, అవార్డుల కోసం కృషి చేయలేదని, విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.