Bhatti Vikramarka: మహిళా సంఘాలతో సోలార్ పవర్ ప్రాజెక్టులు : భట్టి విక్రమార్క
మహిళా సంఘాలతో కలిసి సోలార్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించి, ఉత్పత్తి అయిన విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. పేద్దపల్లి జిల్లాలో ప్రారంభించిన రూ. 85 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భూమి పూజ చేశారు. మహిళా సారథ్యంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహం ఉందని భట్టి విక్రమార్క వివరించారు.
ఎల్లంపల్లి ముంపు బాధితులకు రూ. 18 కోట్లు
కాచాపూర్‌లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించి, సుమారు 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం, బైపాస్ రోడ్డు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, రైతుల రుణమాఫీపై కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం, ఎల్లంపల్లి ముంపు బాధితులకు రూ. 18 కోట్ల పరిహారం అందజేసిందని ఎంపీ వంశీకృష్ణ అన్నారు.