తదుపరి వార్తా కథనం

BRS: బీఆర్ఎస్‌లో చేరిన ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్ కుమారుడు
వ్రాసిన వారు
Stalin
Nov 19, 2023
04:20 pm
ఈ వార్తాకథనం ఏంటి
సినీ నటుడు, ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్‌కు ఆయన కుమారుడు ఉదయ్‌బాబు షాకిచ్చారు.
ఆదివారం సిద్దిపేటలో ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సమక్షంలో ఉదయ్‌బాబు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరారు.
ఉదయ్‌బాబుకు హరీష్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి ఉదయ్‌బాబు ఈసారి కూడా బీజేపీ నుంచి టికెట్ ఆశించారు.
కానీ పార్టీ బాబు మోహన్‌ను టికెట్ కేటాయించింది. దీంతో మనస్తాపానికి గురైన ఉదయ్‌బాబు బీఆర్ఎస్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, బాబు మోహన్‌పై ఆందోల్ బీజేపీ కేడర్ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ గెలుపునకు కృషి చేయాలని బాబూ మోహన్ అడుగుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత మాట్లాడుతున్న ఉదయబాబు
Babu Mohan's son joined BRS.@Uday4BJP pic.twitter.com/quCIiEiArQ
— Vidhya Sagar 🧡🚩 (@VidhyaSagar0810) November 19, 2023
మీరు పూర్తి చేశారు