LOADING...
Sonam Wangchuk: లద్దాఖ్‌ భవన్‌లో నిరాహార దీక్షకు దిగిన సోనమ్‌ వాంగ్‌చుక్
లద్దాఖ్‌ భవన్‌లో నిరాహార దీక్షకు దిగిన సోనమ్‌ వాంగ్‌చుక్

Sonam Wangchuk: లద్దాఖ్‌ భవన్‌లో నిరాహార దీక్షకు దిగిన సోనమ్‌ వాంగ్‌చుక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2024
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ తన అనుచరులతో కలిసి నిరాహార దీక్షకు దిగారు. లద్దాఖ్‌ భవన్‌, దిల్లీని వేదికగా చేసుకొని ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత జంతర్‌ మంతర్‌ వద్ద దీక్షకు అనుమతి కోరినా పోలీసులు నిరాకరించారు. ఇక వాంగ్‌చుక్‌ లేఖను 'ఎక్స్‌' (మాజీ ట్విట్టర్) వేదికగా షేర్‌ చేస్తూ, ప్రత్యామ్నాయ వేదిక దొరకకపోవడంతో లద్దాఖ్‌ భవన్‌ వద్దనే దీక్షకు దిగాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ నిరసన పూర్వం, వాంగ్‌చుక్‌ లేహ్‌ ఎపెక్స్‌ బాడీ, కార్గిల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌ నేతృత్వంలో 'దిల్లీ చలో' పాదయాత్రను లేహ్‌ నుంచి ప్రారంభించారు.

Details

వాంగ్‌చుక్ సహా 18 మంది నిరాహారదీక్ష

లద్దాఖ్‌ను భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్‌తో ఈ పాదయాత్ర చేపట్టారు. దీక్షలో పాల్గొంటున్న వాంగ్‌చుక్‌తో పాటు మరికొంత మందిని సోమవారం రాత్రి దిల్లీ పోలీసులు నిర్బంధించారు, అయితే అతి త్వరలోనే వారిని విడుదల చేశారు. ప్రస్తుతం వాంగ్‌చుక్ సహా 18 మంది లద్దాఖ్ భవన్‌ వద్ద నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.