
Cab driver stabbed: దిల్లీలో క్యాబ్ డ్రైవర్ హత్య.. ఓవర్‌టేక్ చేయడానికి దారిఇవ్వలేదని
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ దిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఓవర్‌టేక్ చేసే విషయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు క్యాబ్ డ్రైవర్ తో గొడవపడి అతనిని కత్తితో పొడిచి చంపారు.
ఈ కేసుకు సంబంధించి మైనర్‌ను పోలీసులు పట్టుకోగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
సంగం విహార్‌కు చెందిన మనోజ్ కుమార్ గురుగ్రామ్‌లోని ఓ కంపెనీలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
నిన్న సాయంత్రం,అతను మాల్వియా నగర్ నుండి ఐదుగురు ఉద్యోగులను తీసుకొని మరొక ఉద్యోగిని పికప్ చేసుకోవడానికి మెహ్రౌలీకి వెళ్తుండగా,అతని క్యాబ్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది.
Details
ఇద్దరు నిందితుల కోసం పోలీసుల గాలింపు
రాత్రి 8.40 గంటల ప్రాంతంలో ముగ్గురు నిందితులు బైక్‌పై వచ్చి దారి ఇవ్వాలని మనోజ్‌ను కోరగా, స్థలం లేకపోవడంతో కుదరలేదు.
దీంతో వారి మధ్య గొడవ జరిగి వారిలో ఒకరు కత్తితో మనోజ్ ఛాతిపై పొడిచాడు.
అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు మనోజ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల్లో ఒకరైన మైనర్‌ని గుర్తించి పట్టుకున్నారు. ప్రస్తుతం మిగిలిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.