
ఊరిస్తున్న నైరుతిరుతుపవనాలు..ఇంకా కేరళను తాకని తొలకరిజల్లులు
ఈ వార్తాకథనం ఏంటి
నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. జూన్ 15 వస్తే గానీ తెలంగాణలో వానలు కురవకపోవచ్చని వాతావరణ శాఖ భావిస్తోంది.
ప్రస్తుతం అండమాన్ దీవులను దాటి బంగాళాఖాతంలో కొంత ముందుకు వచ్చిన రుతు పవనాలు కదలలేక స్తబ్ధుగా ఆగిపోయాయి.
గత సంవత్సరం జూన్ 1నే రుతుపవనాలు కేరళను తాకాయి. ఈసారి అదే సమయానికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. దీని వల్ల భారత్ లోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం 5 శాతం మేర తగ్గిపోనుందని అంచనా.
వాతావరణ మార్పుల ప్రభావం రుతుపవనాలపై పడి, అవి సముద్రంపైనే ఉంటూ దోబూచులు ఆడుతున్నాయి. ఫలితంగా మరో 3 రోజుల దాటాకే కేరళ తీరాన్ని తాకే అవకాశమున్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది.
ASAS
నేటి నుంచి 4 రోజులు వరకు అధిక ఉష్ణోగ్రతలు: వాతావరణ కేంద్రం
మరోవైపు అరేబియా సముద్రంలో లక్ష దీవులను తాకిన రుతుపవనాలు ఇంకా ఎటూ కదలలేదు. రుతుపవనాల ఆలస్యానికి ఎల్‌నినో ప్రభావం కొంత కారణం ఉండొచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.
అసలు కరువు పరిస్థితులు ఏర్పడటానికి కారణం ఎల్‌నినో ప్రభావమేనని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది.
తెలంగాణలో మంగళవారం నుంచి 4 రోజులు వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు.
దాదాపుగా 42 నుంచి 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కోన్నారు. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలు, దక్షిణ తెలంగాణలోని నల్గొండ జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.