ఈసారి మరింత ఆలస్యంగా తెలంగాణకు రుతుపవనాలు రాక
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సారి నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.
జూన్ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వెల్లడించింది.
జూన్ మొదటి వారం కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొంది. రుతుపవనాలు తెలంగాణను తాకే క్రమంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
అయితే రాష్ట్రంలో జూన్ చివరి వారం నుంచి మాత్రమే రుతుపవనాలు పుంజుకుంటాయని వెల్లడించింది.
తెలంగాణ
రాబోయే 3-4 రోజుల పాటు తెలంగాణాలో బలమైన వేడి గాలులు
రుతువనాలు వచ్చే వరకు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గవని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో బుధవారం హైదరాబాద్‌లో గరిష్టంగా 40డిగ్రీలు, కనిష్టంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో గురువారం కూడా పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది.
వచ్చే 3-4 రోజుల్లో తెలంగాణాలో బలమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 45-46 డిగ్రీలు, హైదరాబాద్‌లో 41-43 డీగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అంచనా వేసింది.