NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Southwest monsoon: నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై కీలక అప్డేట్ ఇచ్చిన ఐఎండీ 
    తదుపరి వార్తా కథనం
    Southwest monsoon: నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై కీలక అప్డేట్ ఇచ్చిన ఐఎండీ 
    నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై కీలక అప్డేట్ ఇచ్చిన ఐఎండీ

    Southwest monsoon: నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై కీలక అప్డేట్ ఇచ్చిన ఐఎండీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 13, 2024
    03:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ సగటు కంటే 8శాతం అధిక వర్షపాతం నమోదయింది. ఈ పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై భారత వాతావరణశాఖ(ఐఎండీ)కీలక ప్రకటన చేసింది.

    వర్షాల తీవ్రత కొంత తగ్గబోతోందని,రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కావచ్చని వెల్లడించింది.

    నైరుతి రుతుపవనాల ప్రభావం ఈఏడాది అధికంగా ఉండటంతో భారీ వర్షాలు దేశమంతటా కురిశాయి.

    దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే వర్షపాతం 8శాతం అధికంగా నమోదవ్వడంతో, ప్రజలకు కాస్త రిలీఫ్​ అందించే వార్తను ఐఎండీ ప్రకటించింది.

    ఉపసంహరణ ప్రక్రియ సెప్టెంబర్ 22న వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

    ఇదే జరిగితే,గత ఎనిమిదేళ్లలో ఇది తొలిసారి వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాలు త్వరగా వైదొలగడం అవుతుంది.

    వివరాలు 

    కర్ణాటక, తమిళనాడులో విస్తారంగా వర్షాలు పడే అవకాశం

    గతేడాది, రుతుపవనాల ఉపసంహరణ సెప్టెంబర్ 25న ప్రారంభమైంది. 2022లో, సెప్టెంబర్ 30న పంజాబ్, దిల్లీ, జమ్ముకశ్మీర్, హిమాచల్​ ప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఉపసంహరణ ప్రక్రియ ముగిసినప్పటికీ, వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

    ఈ ఏడాది కూడా అల్పపీడన ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవవచ్చని, నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పూర్తిగా ఒక్కసారిగా జరగదని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు.

    ఈ వారం దేశవ్యాప్తంగా వాతావరణం అనుకూలంగా ఉండటం లేదని, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ, మిగతా ప్రాంతాల్లో పెద్దగా వర్షపాతం ఉండదని తెలిపారు.

    వివరాలు 

     8శాతం అధిక వర్షపాతం 

    ఐఎండీ సెప్టెంబర్ 19 నుంచి 25మధ్య వర్షపాతంపై అంచనాలు ప్రకటించింది. వాయువ్య భారతం నుంచి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపింది.

    సెప్టెంబర్ మొదటి 12 రోజుల్లో దేశవ్యాప్తంగా 22.7%అధిక వర్షపాతం నమోదవ్వగా, వాయువ్య భారతంలో 32.3% అధిక వర్షపాతం,తూర్పు,ఈశాన్య ప్రాంతాల్లో 47.4%లోటు, మధ్య భారతంలో 45.1% అధికం, ద్వీపకల్ప భారతంలో 64.1%అధిక వర్షపాతం నమోదయింది.

    మొత్తంగా, ఈ రుతుపవనాల సీజన్ ప్రారంభమైన జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా 8శాతం అధిక వర్షపాతం నమోదైంది.

    రుతుపవనాలు సాధారణంగా సెప్టెంబర్ 17న ఉపసంహరణను ప్రారంభిస్తాయి, అక్టోబర్ 15నాటికి దేశం నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంటాయి.

    వాయువ్య భారతంలో ఉపసంహరణ ఆలస్యం అయితే,అక్టోబర్ నెలలో కోతకు వచ్చే పంటలపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐఎండీ
    నైరుతి రుతుపవనాలు

    తాజా

    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్
    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్

    ఐఎండీ

    IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక  భారీ వర్షాలు
    ఐఎండీ హెచ్చరికలు; ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; హిమాచల్‍‌లో 122కు చేరిన మృతులు  భారీ వర్షాలు
    IMD: ముంబైకి భారీ వర్ష సూచన; యమునా నది మళ్లీ ఉగ్రరూపం భారీ వర్షాలు
    దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ భారీ వర్షాలు

    నైరుతి రుతుపవనాలు

    ఊరిస్తున్న నైరుతిరుతుపవనాలు..ఇంకా కేరళను తాకని తొలకరిజల్లులు  వర్షాకాలం
    నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం వర్షాకాలం
    కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు; ధృవీకరించిన ఐఎండీ  ఐఎండీ
    తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం వర్షాకాలం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025