LOADING...
Pawan Kalyan: మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ : పవన్ కళ్యాణ్
మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ : పవన్ కళ్యాణ్

Pawan Kalyan: మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ : పవన్ కళ్యాణ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2025
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పరిశ్రమల, మత్స్య శాఖ కమిషనర్లు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ, కాకినాడ జిల్లా కలెక్టర్ చేరారు. అదనంగా మత్స్యకార వర్గానికి చెందిన సభ్యులు కూడా జిల్లా కలెక్టర్ ద్వారా నామినేట్ చేయబడ్డారు. కమిటీ ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడం లక్ష్యంగా పనిచేస్తుంది. మత్స్యకారుల సమస్యలకు తక్షణ స్పందన చూపించి కమిటీ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.