LOADING...
Telangana: తెలంగాణలో డ్రోన్ల కోసం దేశంలోనే ప్రత్యేక డిఫెన్స్ ఫెసిలిటీ: మంత్రి శ్రీధర్‌బాబు
తెలంగాణలో డ్రోన్ల కోసం దేశంలోనే ప్రత్యేక డిఫెన్స్ ఫెసిలిటీ: మంత్రి శ్రీధర్‌బాబు

Telangana: తెలంగాణలో డ్రోన్ల కోసం దేశంలోనే ప్రత్యేక డిఫెన్స్ ఫెసిలిటీ: మంత్రి శ్రీధర్‌బాబు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోనే తొలి సారి తెలంగాణలో డ్రోన్ల కోసం ప్రత్యేక రక్షణ సౌకర్యం ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో జేఎస్‌డబ్ల్యూ డ్రోన్ కంపెనీ స్థాపన కోసం పార్థ జిందాల్ భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదిరిన ఒప్పందం ప్రకారం రూ. 8,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అమలు కానున్నట్టు వెల్లడించారు.

వివరాలు 

తెలంగాణను ఎంపిక చేసుకున్న జేఎస్‌డబ్ల్యూ

మహేశ్వరంలో ఈ సౌకర్యం ఏర్పాటు అవ్వడంతో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని మంత్రి తెలిపారు. అనేక రాష్ట్రాలు ఆహ్వానించినప్పటికీ జేఎస్‌డబ్ల్యూ సంస్థ తెలంగాణను ఎంపిక చేసుకోవడం రాష్ట్ర పారిశ్రామిక విధానం బలాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. అలాగే, ఈ నెల 8, 9 తేదీల్లో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ ద్వారా మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని, రాష్ట్ర అభివృద్ధి వేగవంతం చేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆయన వివరించారు.

Advertisement