
Ponnam Prabhakar: రైతులకు మరో శుభవార్త చెప్పిన పొన్నం ప్రభాకర్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఒకటైన రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ఒకటి.
పంట కోసం రుణాలు తీసుకున్న రైతులకు రూ. 2 లక్షల వరకు లోన్లు మాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం జులై 18న రైతు రుణమాఫీని ప్రారంభించింది.
ఈ రుణమాఫీని మొత్తం మూడు విడతలలో మాఫీ చేస్తుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో రూ. లక్ష, రూ. లక్షన్నర వరకు రుణాలు మాఫీ అయ్యాయి.
ఈ నెల 15న మరోసారి మూడో విడతగా రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాంతో రుణమాఫీ ప్రక్రియ ముగుస్తుంది.
వివరాలు
రుణమాఫీ అందని రైతుల కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్
బ్యాంక్ అకౌంట్ నెంబర్లలో తప్పులు గాని, ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోవడం, వివిధ టెక్నీకల్ కారణాలతో.. అర్హులైన సరే రైతులలో కొందరికి రుణమాఫీ జరగలేదు.
దీంతో ఆ రైతులు ఆందోళనకు గురవుతున్నారు.తమకు రుణమాఫీ జరగలేదంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్‌న్యూస్ చెప్పారు.
రుణమాఫీ అందని రైతుల కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారందరి రుణాలను మాఫీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రైతులెవరూ ఆధైర్యపడొద్దని.. ఆందోళనకు గురికావొద్దని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు.
అదేసమయంలో రుణమాఫీపై బీఆర్ఎస్ చేస్తోన్న ఆరోపణలు కూడా పొన్నం ఖండించారు.