NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రష్యాలో ఏయిర్ఇండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..సహాయం కోసం ముంబయి నుంచి మరో ఫ్లైట్
    తదుపరి వార్తా కథనం
    రష్యాలో ఏయిర్ఇండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..సహాయం కోసం ముంబయి నుంచి మరో ఫ్లైట్
    సహాయం కోసం ముంబయి నుంచి మరో ఫ్లైట్

    రష్యాలో ఏయిర్ఇండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..సహాయం కోసం ముంబయి నుంచి మరో ఫ్లైట్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 07, 2023
    01:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకి భారత రాజధాని న్యూదిల్లీ నుంచి ఓ విమానం బయల్దేరింది. అది కాస్తా సాంకేతిక లోపంతో మంగళవారం అర్థాంతరంగా రష్యాలోని మగడాన్ ఏయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది.

    ఇందులో ఉన్న దాదాపు 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే వీరంతా సహాయక విమానం కోసం పడిగాపులు కాస్తున్నారు.

    ఈ ప్రయాణికుల సహాయార్థం వెళ్లాల్సిన విమానం, బయల్దేరడంలో తీవ్ర జాప్యం నేపథ్యంలో కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ ప్రకటన వారికి ఊరటనిస్తోంది.

    ఈ విమానంలోని ప్రయాణికులను శాన్ ఫ్రాన్సిస్కో తరలించేందుకు, సహాయక విమానం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబయి నుంచి బయల్దేరుతుందని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    Special Flight Arranged For Air India Passengers

    ముంబయి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు స్పెషల్ ఫ్లైట్

    మగడాన్ ఏయిర్ పోర్ట్ రష్యా రాజధాని నగరం మాస్కో నుంచి సుమారు 10 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ హోటల్ సదుపాయాలు సైతం సరిగ్గా లేకపోవడంతో ప్యాసింజర్లను డార్మిటరీల్లో ఉంచారు.

    ఈ సమస్య పరిష్కారం కోసం ఎయిర్ ఇండియాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు సదరు మంత్రిత్వశాఖ తెలిపింది.

    ఎయిర్ ఇండియా B777-200LR VT-ALF విమానాన్ని మగడాన్ విమానాశ్రయానికి పంపిస్తున్నామన్న విమానయాన శాఖ, స్వయంగా ఆ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేసింది.

    మగడాన్‌లో చిక్కుకున్న ప్రయాణికులను, సామాగ్రిని ఈ విమానంలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు తీసుకెళ్లనున్నారని పేర్కొంది. ప్రయాణికులకు సదుపాయాలు కల్పిస్తున్నట్లు, స్థానిక ప్రభుత్వం కూడా సహకరిస్తోందని ఎయిరిండియా చెప్పిందని కేంద్ర విమానయాన శాఖ వివరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విమానం
    రష్యా

    తాజా

    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ
    Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక తెలంగాణ

    విమానం

    డీజీసీఏ: ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్‌' విమానానికి రూ.10లక్షల జరిమానా కర్ణాటక
    ఐఏఎఫ్: మధ్యప్రదేశ్‌లో కుప్పుకూలిన రెండు యుద్ధ విమానాలు , ఒక పైలెట్ మిస్సింగ్ మధ్యప్రదేశ్
    విస్తారా విమానంలో ఇటాలియన్ ప్రయాణికురాలి బీభత్సం, మద్యం మత్తులో అర్ధనగ్న ప్రదర్శన ముంబై
    టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎయిర్ ఇండియా

    రష్యా

    బాంబు బెదిరింపు: రష్యా నుంచి గోవా వస్తున్న విమానం ఉజ్బెకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉజ్బెకిస్తాన్
    ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ భారీగా యుద్ధ ట్యాంకుల సాయం! ఉక్రెయిన్
    నన్ను చంపుతానని పుతిన్ బెదిరించారు: బోరిస్ జాన్సన్ బ్రిటన్
    రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు: అమెరికా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025