తదుపరి వార్తా కథనం

Parliament: నవంబర్ 26న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం.. కారణమిదే?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 27, 2024
12:43 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తియైంది. ఈ సందర్భంగా నవంబర్ 26న పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి.
1949 నవంబర్ 26న పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగాన్ని ఆమోదించగా, 75 ఏళ్ల తర్వాత అదే ప్రదేశంలో సభ్యులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ఈ ప్రత్యేక సమావేశంలో రాజ్యాంగ మార్పులు, చేర్పులపై చర్చ జరగనుందని పలు విశ్లేషకులు భావిస్తున్నారు. నవంబర్ 26ను జాతీయ న్యాయదినోత్సవంగా నిర్వహించేవారు.
కానీ, 2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా మార్పుచేశారు. ఈ ఏడాది నవంబర్ 26నాటికి మన రాజ్యాంగానికి 75 సంవత్సరాలు పూర్తి అవుతోంది.
ఆ రోజున ఉభయ సభలను ప్రత్యేక సమావేశంలో పిలవాలని కేంద్రం నిర్ణయించింది.