తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Special Train: చర్లపల్లి నుంచి డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలు సర్వీసు.. వెల్లడించిన దక్షిణమధ్య రైల్వే
                వ్రాసిన వారు
                Sirish Praharaju
            
            
                            
                                    Jun 06, 2025 
                    
                     02:37 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి నుండి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలు సేవలను అందించనుందని ప్రకటించింది. ఈ ప్రత్యేక రైలు (నెం.07077)జూన్ 10, 17, 24 తేదీల్లో చర్లపల్లి నుంచి బయలుదేరనుంది. తిరుగు ప్రయాణ రైలు (నెం.07078) దేహ్రాదూన్ నుంచి చర్లపల్లికి జూన్ 12, 19, 26 తేదీల్లో ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ రైళ్లు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బళ్లార్ష, నాగ్‌పుర్, ఇటార్సి, రాణి కమలాపతి, భినా, ఝాన్సీ, ఆగ్రా, మధుర, హజ్రత్ నిజాముద్దీన్, మేరఠ్, రూర్కీ, హరిద్వార్ స్టేషన్లలో నిలుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎ. శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.