Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు డివిజన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో రైళ్ల తేదీలు, ప్రయాణ మార్గాలను వెల్లడించారు. కోయంబత్తూరు-జైపూర్ ప్రత్యేక వీక్లీ రైలు (06181)ను ఆగస్టు 13 నుంచి సెప్టెంబరు 3 వరకు ప్రతి బుధవారం నడపనున్నారు. ఈ కాలంలో మొత్తం నాలుగు ట్రిప్పులు నిర్వహిస్తారు. తిరుగు ప్రయాణంలో జైపూర్-కోయంబత్తూరు ప్రత్యేక రైలు (06182)ను ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 6 వరకు ప్రతి ఆదివారం నాలుగు ట్రిప్పులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
తేదీలు, మార్గాలు ఇవే
ఈ రైలు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పట్టై, కాట్పాడి, రేణిగుంట, కడప, యర్రగుంట్ల, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, గద్వాల, మహబూబ్‌నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముడ్‌ఖేడ్, హుజూర్ సాహెబ్ నాందేడ్, పూర్ణా, హింగోలి డెక్కన్, వాసిం,అకోలా, మల్కాపూర్, భూసావల్, జల్గావ్, ధరన్‌గావ్, ఉడ్నా, భరుచ్, వడోదర, గోద్రా, రత్లం, జవోరా, మండ్‌సోర్, నిమచ్, ఛిత్తోర్‌ఘడ్, భిల్వారా, బిజయ్‌నగర్, నాసిరాబాద్, అజ్మీర్, కిషన్‌గర్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని వెల్లడించారు.
అదే విధంగా బాంద్రా టెర్మినల్-వెలంకని ప్రత్యేక రైలు (09059)ను ఆగస్టు 27,సెప్టెంబరు 1 తేదీల్లో రెండు ట్రిప్పులు నడపనున్నారు.
తిరుగు ప్రయాణంలో వెలంకని-బాంద్రా టెర్మినల్ ప్రత్యేక రైలు (09060)ను ఆగస్టు 30,సెప్టెంబరు 4 తేదీల్లో రెండు ట్రిప్పులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
తేదీలు, మార్గాలు ఇవే
ఈ రైలు బోరివాలి, వసాయ్ రోడ్, పన్వేల్, కర్జత్, లోనావాలా, పుణే, డౌండ్, షోలాపూర్, వాడి, యాద్గిర్, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్, తిరువణ్ణామలై, విల్లుపురం, మయిలదుతురై, నాగపట్టణం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.