Jos Buttler: నా రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టే అవకాశం ఉంది: జాస్ బట్లర్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లాండ్ స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ జాస్ బట్లర్ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతకాలం ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ పేరిట ఉండేది. పొలార్డ్ 746 మ్యాచ్‌ల్లో 14,803 పరుగులు చేయగా, బట్లర్ కేవలం 522 మ్యాచ్‌ల్లోనే 14,833 పరుగులు సాధించి ఆ మార్కును అధిగమించాడు. ప్రస్తుతం జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బట్లర్, వెల్ష్ ఫైర్పై కేవలం 20 బంతుల్లోనే 51 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఈ చారిత్రక మైలురాయిని చేరుకున్నాడు.
వివరాలు
వివిధ టోర్నీల్లో బట్లర్ పరుగులు ఇలా..
ది హండ్రెడ్ - 31 మ్యాచ్‌లు, 1,192 పరుగులు
విటాలిటీ బ్లాస్ట్ - 115 మ్యాచ్‌లు, 2,688 పరుగులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 138 మ్యాచ్‌లు, 4,646 పరుగులు
ఎస్‌ఏ20 లీగ్ - 31 మ్యాచ్‌లు, 969 పరుగులు
బిగ్ బాష్ లీగ్ - 18 మ్యాచ్‌లు, 605 పరుగులు
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ - 14 మ్యాచ్‌లు, 225 పరుగులు
ఛాంపియన్స్ లీగ్ టీ20 - 5 మ్యాచ్‌లు, 59 పరుగులు
వివరాలు
రికార్డు తర్వాత బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ ఘనత అనంతరం మాట్లాడిన జాస్ బట్లర్, క్రికెట్ ఆట ఎంత వేగంగా మారుతుందో తన అనుభవంతో వివరించాడు.
"క్రికెట్‌లో పరిస్థితులు క్షణాల్లో మారిపోతాయి. ఒకరోజు తీవ్ర నిరాశ ఎదురవుతుంది.
మరుసటి రోజే అదృష్టం మీవైపు నిలుస్తుంది. కొద్ది నెలల క్రితం నేను ఫామ్ కోసం చాలా కష్టపడ్డాను.
కానీ ఇప్పుడు నా కెరీర్‌లోనే అత్యుత్తమ బ్యాటింగ్ చేస్తున్నాననే భావన కలుగుతోంది.
ప్రతి ఆటగాడి ముందు రెండు మార్గాలే ఉంటాయి. ఒకటి ఆటను వదిలేయడం, రెండోది పట్టుదలతో ముందుకు సాగి తిరిగి ఫామ్‌ను అందుకోవడం.
నేను రెండో మార్గాన్నే ఎంచుకున్నాను. ప్రపంచంలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడం ఎంతో ఆనందంగా ఉంది.