Page Loader
Srinagar NIT : శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో ఉద్రిక్తత.. కష్టాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు
Srinagar NIT : శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో ఉద్రిక్తత.. తెలుగు ప్రభుత్వాలే ఆదుకోవాలని అభ్యర్థన

Srinagar NIT : శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో ఉద్రిక్తత.. కష్టాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 30, 2023
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉన్నత విద్య కోసం ఉత్తరాది వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ NIT (National Institute Of Technology)లో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. చదువుకునే విద్యాలయాల్లో మతపరమైన అంశంపై సోషల్ మీడియాల్లో పలు పోస్టులపై కొందరు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఐటీ అధికారులు సదరు విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఆగమేఘాల మీద ఖాళీ చేయిస్తున్నారు. డిసెంబరు 20లోగా పరీక్షలు ఉన్నప్పటికీ రెండు వర్గాల విద్యార్థుల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల క్రమంలో ఎన్‌ఐటీ అధికార యంత్రాంగం విద్యార్థుల వసతి గృహాలను ఖాళీ చేయిస్తోంది.

DETAILS

మమ్మల్ని ఆదుకోండి : తెలుగు విద్యార్థులు

అయితే ఉన్నఫలంగా విద్యార్థి వసతి గృహాలను ఖాళీ చేయంటే ఎక్కడి వెళ్తామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శ్రీనగర్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థలో చదువుతున్న తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 300 మంది తెలుగు విద్యార్థులు ఇక్కడి ఎన్‌ఐటీలో విద్య అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనగర్‌ నుంచి అత్యవసరంగా ప్రయాణం చేసేందుకు విమానాలు, రైలు సదుపాయం లేవు. దీంతో తమను ఆదుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆయా విద్యార్థులు అర్థిస్తున్నారు. ఫలితంగా తాము స్వస్థలాలకు చేరుకుంటామని గోడు వెళ్లబోసుకుంటున్నారు.