Page Loader
Water Storage at Dams: వరద ప్రవాహంతో కళకళాడుతున్న శ్రీశైలం,తుంగభద్ర జలాశయాలు..! 
వరద ప్రవాహంతో కళకళాడుతున్న శ్రీశైలం,తుంగభద్ర జలాశయాలు..!

Water Storage at Dams: వరద ప్రవాహంతో కళకళాడుతున్న శ్రీశైలం,తుంగభద్ర జలాశయాలు..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి స్వల్ప స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం అక్కడికి వస్తున్న ఇన్‌ఫ్లో 893 క్యూసెక్కులుగా నమోదు కాగా, అవుట్‌ఫ్లో పూర్తిగా నిలిపివేశారు. ఈ జలాశయం పూర్తిగా నిండే నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం అందులో 835.20 అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 55.3581 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఇటీవల వర్షపాతం తగ్గిపోయిన నేపథ్యంలో, జలాశయానికి వచ్చి చేరుతున్న వరద నీటి ప్రవాహం తక్కువగా నమోదవుతోంది. ఇక విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి, శ్రీశైలం కుడి, ఎడమవైపు ఉన్న విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేయబడినట్టు సమాచారం అందింది.

వివరాలు 

వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు అప్రమత్తం

అత్యంత ప్రాముఖ్యత కలిగిన తుంగభద్ర జలాశయంలో మాత్రం వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 7,653 క్యూసెక్కులుగా ఉండగా,అవుట్‌ఫ్లో 213 క్యూసెక్కులుగా ఉంది. ఈ డ్యామ్‌కి సంబంధించిన పూర్తి నీటిమట్టం 1,633అడుగులు కాగా,ప్రస్తుతం అందులో 1,601.69 అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. అలాగే పూర్తి నిల్వ సామర్థ్యం 105.788టీఎంసీలు కాగా,ప్రస్తుతం 23.786 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముందుగా ఎలాంటి పరిస్థితులు ఎదురవచ్చో అన్న దృష్టితో జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున,శ్రీశైలం,తుంగభద్ర జలాశయాల్లోని నీటి మట్టాలను అధికారులు ప్రతిదినం గమనిస్తూ సమీక్షిస్తున్నారు. జలాశయాల పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.