తదుపరి వార్తా కథనం

Srisailam reservoir: శ్రీశైలం జలాశయానికి స్థిరంగా వరద ప్రవాహం.. 8 గేట్లు ఎత్తి నీటి విడుదల
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 30, 2025
09:59 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 8 గేట్ల ద్వారా నీరు విడుదల అవుతోంది. జూరాల,సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి ప్రవహిస్తున్న నీటి పరిమాణం 2,89,670 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నుంచి మొత్తం నీటి విడుదల 3,02,478 క్యూసెక్కులు. ఈ ప్రవాహంలో భాగంగా 8 స్పిల్‌వే గేట్ల ద్వారా 2,16,520 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,643 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తోంది.
వివరాలు
నీటిమట్టం,నిల్వ వివరాలు ఇలా ఉన్నాయి:
శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం అది 882.80 అడుగులకు చేరుకుంది. అలాగే, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 203.42 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.