LOADING...
Tamil Nadu: తమిళనాడు ఎన్నికల బరిలో నిలిచిన స్టార్ డైరక్టర్
తమిళనాడు ఎన్నికల బరిలో నిలిచిన స్టార్ డైరక్టర్

Tamil Nadu: తమిళనాడు ఎన్నికల బరిలో నిలిచిన స్టార్ డైరక్టర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు (Tamil Nadu)కు చెందిన ప్రముఖ దర్శకుడు సి. సుందర్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి తొలిసారిగా అడుగుపెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మదురై సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. దర్శకుడు అన్నాడీఎంకే (DMK) కూటమిలోని పుదియ నీతి కట్చి (PNK) పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడ్డారు. ఈ సమాచారం పుదియ నీతి కట్చి వ్యవస్థాపక అధ్యక్షుడు ఏసీ షణ్ముగం శనివారం ప్రకటించారు. షణ్ముగం వెల్లడించిన వివరాల ప్రకారం, సుందర్‌ పీఎన్‌కే అభ్యర్థి అయినప్పటికీ, ఎన్నికల గుర్తుగా అన్నాడీఎంకే గుర్తు ఉపయోగిస్తారు. దీన్ని ఆయన వ్యక్తిగత రాజకీయ ఒప్పందంగా చూడవచ్చని పేర్కొన్నారు.

వివరాలు

సోషల్ మీడియా ద్వారా తెలిపిన ఖుష్బూ

దర్శకుడి భార్య, నటి ఖుష్బూ (Khushbu) సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ''సినీ పరిశ్రమలో మూడు దశాబ్దాలుగా నా భర్తకు ప్రజలు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ప్రజలకు సేవ చేయడమే ఆయన లక్ష్యం. ఆయన భార్యగా ఈ నిర్ణయానికి గర్వంగా ఉన్నానని ఖుష్బూ పేర్కొన్నారు. ఖుష్బూ భాజపా (BJP) సీనియర్ నాయకురాలిగా కూడా ప్రసిద్ధి చెందారు. సుందర్‌ 1990లో 'వాళ్కై చక్కరం' సినిమాతో నటుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. 1995లో 'మురై మానమ్‌'తో దర్శకుడిగా మారి దాదాపు 40 సినిమాలకు దర్శకత్వం వహించారు. పదికి పైగా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన 'మూకుతీ అమ్మన్‌ 2' మరియు 'పురుషన్‌' చిత్రాలపై పని చేస్తున్నారు.

Advertisement