
AP Aadhaar Camps: చిన్నారులకు నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు.. రెండు విడతలుగా క్యాంపులు..
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రవ్యాప్తంగా 0-6 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ఆధార్ నమోదు చేయడానికి ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ వెల్లడించింది.
చిన్నారులందరికీ తప్పనిసరిగా ఆధార్ నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారులు ఆధార్ కార్డుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
అదేవిధంగా, ఇప్పటివరకు ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయించుకోని రాష్ట్రవ్యాప్తంగా సుమారు 52.02 లక్షల మంది ఉన్నారని గుర్తించారు. వీరికి కూడా తమ ఆధార్ వివరాలను నవీకరించుకునే అవకాశం కల్పించారు.
వివరాలు
జిల్లా కలెక్టర్లు, మండల అభివృద్ధి అధికారులకి ఆదేశాలు
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి డిజిటల్ అసిస్టెంట్లు,వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీలను ఇతర బాధ్యతల నుండి తప్పించి,శిబిరాల నిర్వహణలో నిమగ్నం చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు గ్రామ,వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఎం.శివప్రసాద్ అన్ని జిల్లా కలెక్టర్లకు,గ్రామ,వార్డు సచివాలయ జిల్లా ఇన్‌ఛార్జ్‌లకు లేఖ రాశారు.
జిల్లా కలెక్టర్లు, మండల అభివృద్ధి అధికారులు(MPDO)కి ఆదేశాలు పంపిస్తారు.
మండలాల్లో ఉన్న మొత్తం చిన్నారుల వివరాలు, ఇప్పటివరకు ఆధార్ నమోదు చేయించుకోని వారి సంఖ్యపై సమాచారం సిద్ధం చేయాలని కలెక్టర్లు సూచించారు.
MPDOలు అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాల సహాయంతో ఈ వివరాలను సేకరించి, ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు కోసం ప్రణాళిక రూపొందించారు.
దీనివల్ల నేటి నుండి ఆధార్ క్యాంపులు ప్రారంభం కానున్నాయి.
వివరాలు
ఆధార్ క్యాంపుల షెడ్యూల్
మొదటి విడత: ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 5 వరకు మూడు రోజుల పాటు ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు.
రెండో విడత: ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 11 వరకు నాలుగు రోజులపాటు ఆధార్ క్యాంపులు కొనసాగిస్తారు.
మండల అభివృద్ధి అధికారులు (MPDOలు), మున్సిపల్ కమిషనర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వివరాలు
చిన్నారుల ఆధార్ నమోదుకు అవసరమైన పత్రాలు
క్యూఆర్ కోడ్ కలిగిన పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం.
ఆధార్ నమోదు దరఖాస్తు ఫారం.
చిన్నారిని తల్లి లేదా తండ్రి మాత్రమే ఆధార్ క్యాంపుకు తీసుకెళ్లాలి.
ఇతరుల ద్వారా చిన్నారిని తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
తల్లి లేదా తండ్రి తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
ఆధార్ నమోదు పూర్తిగా ఉచితంగా జరుగుతుంది; ఎటువంటి రుసుము లేదు.