Loading...
Yogi Adityanath: యూపీలో 1.27 కోట్ల హిందూ ఓట్లు గల్లంతు? యోగి ఆరోపణలపై ఈసీ వివరణ
యూపీలో 1.27 కోట్ల హిందూ ఓట్లు గల్లంతు? యోగి ఆరోపణలపై ఈసీ వివరణ

Yogi Adityanath: యూపీలో 1.27 కోట్ల హిందూ ఓట్లు గల్లంతు? యోగి ఆరోపణలపై ఈసీ వివరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై రాజకీయ వివాదం నెలకొంది. ఈ ప్రక్రియలో సుమారు 1.27కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతయ్యాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. తాజాగా ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా స్పందించారు. ఓటర్ల జాబితా తయారీలో కులం,మతం ఆధారంగా ఎలాంటి వివరాలను ఎన్నికల సంఘం సేకరించదని స్పష్టం చేశారు. వాటి ఆధారంగా అధికారికంగా ఎలాంటి గణాంకాలను కూడా రూపొందించదని తెలిపారు. గతంలో నిర్వహించిన ఎస్ఐఆర్ తర్వాత ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకున్నాయని యోగి ఆదిత్యనాథ్ ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు.

వివరాలు 

యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారంటే?

రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ, కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన జాబితాలో సుమారు 1.27 కోట్ల మంది హిందూ ఓటర్ల పేర్లు కనిపించడం లేదని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఓటర్ల జాబితాలో పేర్లు లేని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో సుమారు 55 లక్షల మంది హిందువులు ఉన్నారని యోగి వెల్లడించారు.

అలాగే 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 4.5 లక్షల మంది యువ ఓటర్ల పేర్లు కూడా జాబితాలో కనిపించడం లేదని ఆరోపించారు.

ఈ సందర్భంగా మరికొన్ని గణాంకాలను కూడా ఆయన ప్రస్తావించారు.

వివరాలు 

యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారంటే?

ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.

ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ అని కూడా యోగి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ఆరోపణలపై స్పందించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా కీలక విషయాలు వెల్లడించారు.

ఓటర్ల మతం, కులానికి సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘం సేకరించదని స్పష్టం చేశారు.

అలాంటి వివరాల ఆధారంగా ఎలాంటి అధికారిక విశ్లేషణలు లేదా గణాంకాలను కూడా విడుదల చేయదని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఓటర్ల జాబితాలో ఎలాంటి వివరాలుంటాయి?

ఎన్నికల సంఘం నిర్వహించే ఓటర్ల డేటాబేస్‌లో ఓటరు పేరు, తండ్రి లేదా జీవిత భాగస్వామి పేరు, వయసు, ఇంటి నంబరు, లింగం వంటి వివరాలు మాత్రమే ఉంటాయని నవదీప్ రిన్వా తెలిపారు.

ఇందులో కులం, మతానికి సంబంధించిన సమాచారం ఉండదని స్పష్టం చేశారు.

ఓటర్ల జాబితాలు బహిరంగ పత్రాలు కావడంతో మీడియా సంస్థలు, స్వతంత్ర విశ్లేషకులు వాటిలోని పేర్లు, ఇతర వివరాలను ఆధారంగా చేసుకుని తమదైన విశ్లేషణలు చేస్తుంటారని చెప్పారు.

అయితే అలాంటి విశ్లేషణలను ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలుగా భావించకూడదని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

యూపీలో మొత్తం 13.58 కోట్ల మంది ఓటర్లు

మంగళవారం ప్రచురించిన ఉత్తరప్రదేశ్ ఓటర్ల ముసాయిదా జాబితాలో మొత్తం 13.58కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నట్లు నవదీప్ రిన్వా వెల్లడించారు.

ఇందులో మహిళా ఓటర్లు 6.20 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. ఏప్రిల్‌లో నిర్వహించిన ఎస్ఐఆర్ తర్వాత చేపట్టిన ప్రత్యేక సంక్షిప్త సవరణ (SSR) ప్రక్రియలో కొత్తగా 18లక్షల మందికి పైగా ఓటర్లు జాబితాలో చేరినట్లు వివరించారు.

ఎస్ఎస్ఆర్ కింద రూపొందించిన ముసాయిదా జాబితాలో మొత్తం 13,58,68,905మంది ఓటర్లు ఉన్నారు.

వీరిలో 7,38,58,510 మంది పురుషులు, 6,20,06,352 మంది మహిళలు, 4,042 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

అలాగే 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న 11,83,352 మంది యువ ఓటర్ల పేర్లు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

వివరాలు 

యూపీలో మొత్తం 13.58 కోట్ల మంది ఓటర్లు

నవంబరు 17 నుంచి డిసెంబరు 16 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరించనున్నట్లు రిన్వా తెలిపారు.

ఈ సమయంలో అర్హులైన ఓటర్లు తమ పేర్లను చేర్చుకోవడం, తొలగింపులు లేదా ఇతర వివరాల్లో మార్పులు చేసుకోవడం కోసం ఫారం 6, 7, 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

వివరాలు 

ఎస్ఎస్ఆర్‌తో ఓటర్ల జాబితాలో మార్పులు

డిసెంబరు 28 నాటికి అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలన్నింటినీ పరిష్కరించనున్నట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు.

అనంతరం 2027 జనవరి 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు.

2026 ఏప్రిల్ 10న ప్రచురించిన తుది ఓటర్ల జాబితాతో పోలిస్తే, ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 18,84,113 మంది ఓటర్లు అదనంగా చేరినట్లు వివరించారు.

ఓటర్ల జాబితా సవరణ అనేది ఏడాది పొడవునా నిరంతరంగా జరిగే ప్రక్రియ అని స్పష్టం చేశారు.

తుది జాబితా ప్రచురించిన తర్వాత కూడా అర్హులైన పౌరులు తమ పేర్లను చేర్చుకోవడానికి లేదా వివరాల్లో మార్పులు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

వివరాలు 

ఎస్ఎస్ఆర్‌తో ఓటర్ల జాబితాలో మార్పులు

ఈ ప్రక్రియను ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.

నవంబరు 21, 22, 28, 29 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రంలోని మొత్తం 1,73,730 పోలింగ్ కేంద్రాల్లో ఈ శిబిరాలు నిర్వహించనున్నారు.

అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను సరిచూసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.

ADVERTISEMENT