Telangana: రహదారి ప్రమాదాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చర్య
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం రహదారి ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి, వాహనదారులలో అవగాహన పెంచే లక్ష్యంతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాజా వివరాల ప్రకారం,రాష్ట్రంలో ప్రతి రోజు సగటున 20మంది రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని విశ్లేషణలు చూపిస్తున్నాయి. 80శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయి. ఈపరిస్థితులకు కారణాలను గుర్తిస్తూ,ప్రజలు అప్రమత్తంగా ఉండేలా ప్రత్యేకలేఖను రూపొందించింది. ఈలేఖను కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వ్యక్తులకు,వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులు పొందిన వారికి జతచేసి డాక్యుమెంట్ రూపంలో పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల రవాణా శాఖ కార్యాలయాలు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. "రహదారి భద్రతా నియమాలను పాటిద్దాం..ప్రమాదాలను నివారిద్దాం"అనే ప్రధాన నినాదంతో,ఈ లేఖలను రవాణాశాఖ మంత్రి పొన్నంప్రభాకర్ సంతకం చేసి అధికారికంగా విడుదల చేశారు.