
YCP: పేర్ని నాని వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం.. తురకా కిశోర్‌పై మరో కేసు!
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల పామర్రులో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన "చీకట్లో కనుసైగ చేస్తే రెండో కంటికి తెలియకుండా వేసేయాలి.. తెల్లారగానే వెళ్లి పరామర్శించాలన్న వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారి తీసాయి. ఈ వ్యాఖ్యలు ప్రత్యర్థి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నా, పేర్ని నాని తన వ్యాఖ్యలు మార్చుకోని తీరు కొనసాగించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం గుడివాడలో కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెడనలో జరగాల్సిన మరో కార్యకర్తల సమావేశానికి ముందు పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Details
వైసీపీ నేతలకు నోటీసులు జారీ
హెచ్చరికలతో పాటు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని హామీ ఇచ్చిన పేర్ని నాని, అదే సభలో గత వ్యాఖ్యలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే, అదే సమయంలో ఆయన మరోసారి నాకు చెప్పాలనిపిస్తే పట్టపగలే వేసేయమంటా అంటూ, అరేయ్.. ఒరేయ్.. అనే పదాలతో కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్రలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో పలుచోట్ల టీడీపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు.
Details
విజయవాడ టూ టౌన్ స్టేషన్ లో కేసు నమోదు
మచిలీపట్నంలోని ఆర్‌పేట పోలీస్ స్టేషన్, విజయవాడ టూ టౌన్ స్టేషన్‌లలో పేర్ని నానిపై కేసులు నమోదు అయ్యాయి. హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారంటూ పామర్రులో కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీఐ శుభకర్‌కు వల్లూరుపల్లి గణేశ్ తదితరులు ఫిర్యాదు అందజేశారు. పేర్ని నానిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని కలకలం చేస్తున్నాయి. విపక్షాలు ఈ వ్యాఖ్యలను ప్రజాస్వామ్యానికి ముప్పుగా అభివర్ణిస్తుండగా, అధికార వైసీపీ మాత్రం ఇప్పటివరకు ఈ వివాదంపై స్పష్టమైన స్పందన ఇవ్వలేదు.
Details
2002లో జరిగిన ఘటనపై కేసు నమోదు
ఇదిలా ఉండగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు, పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిశోర్‌పై మరోసారి హత్యాయత్నం కేసు నమోదైంది. వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో తాజా కేసు నమోదవగా, గతంలో ఉన్న వివాదం ఈ కేసుకు దారితీసింది. ఇది 2022 అక్టోబర్ 7న జరిగిన ఘటనకు సంబంధించింది. ఆ రోజు టీడీపీ నేత దారపనేని శ్రీనివాసరావుపై తురకా కిశోర్, బోదిలవీడుకు చెందిన మేదరమెట్ల శ్రీను, పంగులూరి బాబు తదితరులు దాడికి పాల్పడి హత్యాయత్నం చేశారని ఆరోపణ. పార్టీ మారేది లేదన్న కారణంతోనే ఈ దాడి జరిగిందని తెలుస్తోంది.
Details
తురకా కిశోర్ పై ఏడు హత్యాయత్నం కేసులు
ఇప్పటికే తురకా కిశోర్‌పై ఏడు హత్యాయత్నం కేసులు, మరో ఏడు ఇతర నేర కేసులు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, నెల రోజుల క్రితమే తురకా కిశోర్‌ను మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి ప్రభుత్వం అధికారికంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా కేసు నేపథ్యంలో తురకా కిశోర్ భవిష్యత్తుపై మరింత అనిశ్చితి నెలకొంది.