LOADING...
PM Modi: వికసిత్‌ భారత్‌ దిశగా అడుగులు.. కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
వికసిత్‌ భారత్‌ దిశగా అడుగులు.. కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు

PM Modi: వికసిత్‌ భారత్‌ దిశగా అడుగులు.. కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2026
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2026-27 (Union Budget 2026)పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బడ్జెట్‌ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు. సంస్కరణల ప్రయాణాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు. మూలధన వ్యయం, ఆర్థిక వృద్ధి మధ్య సమతూకాన్ని సమర్థవంతంగా పాటించారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రధాని ప్రశంసించారు. వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి ఈ బడ్జెట్‌ మార్గనిర్దేశం చేస్తుందని, ఇది చరిత్రాత్మక పద్దు అని కొనియాడారు.

Details

భారత్‌ లక్ష్యాలకు అనుగుణంగా కేటాయింపులు

బడ్జెట్‌లో ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలకు అనుగుణంగా కేటాయింపులు ఉన్నాయి. 2047 మిషన్‌ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్‌ను రూపొందించారు. త్వరలో భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది'' అని ప్రధాని మోదీ అన్నారు. ప్రభుత్వ సంస్కరణల అజెండాను 'రిఫార్మ్‌ ఎక్స్‌ప్రెస్‌'గా అభివర్ణించిన మోదీ, ఆ ఎక్స్‌ప్రెస్‌కు ఈ బడ్జెట్‌ కొత్త శక్తిని అందించిందని పేర్కొన్నారు. అమలులో ఉన్న సంస్కరణలు యువతకు విస్తృత అవకాశాలను కల్పిస్తాయని తెలిపారు.

Details

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి

భారతదేశం కేవలం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మాత్రమే ఉండిపోవాలని భారతీయులు అనుకోవడం లేదన్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని చెప్పారు. ఇక ఈ బడ్జెట్‌ మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. వరుసగా తొమ్మిదిసార్లు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక అరుదైన రికార్డు సృష్టించారని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

Advertisement