
Jp Nadda: జేపీ నడ్డా భార్య కారు దొరికేసింది
ఈ వార్తాకథనం ఏంటి
గత నెల 19న దొంగతనానికి గురైన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు వారణాసిలో దొరికేసింది.
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
జేపీ నడ్డా భార్య మల్లికా కారైన ఫార్చునర్ ఎస్యూవీ మార్చి 19న ఢిల్లీలో చోరీకి గురైంది.
కారు డ్రైవర్ జోగిందర్ ఢిల్లీలోని ఓ కార్ సర్వీసింగ్ సెంటర్ నుంచి కారు తీసుకెళ్లాడు.
జేపీ నడ్డాకు ఇంటికి చేరే దారిలోనే మధ్యలో కారు ఆపి తన ఇంటివద్ద భోజనం చేద్దామని లోపలికి వెళ్లాడు.
తిరిగి వచ్చే సరికి కారు కనిపించలేదు.
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా కారు గురుగ్రామ్ వైపు వెళ్లినట్లు గుర్తించారు.
Car theft
ఇరవై రోజుల తర్వాత దొరికిన కార్
అప్పట్నుంచి పోలీసులు కారుకు సంబంధించి కూపీ లాగుతుండగా...ఇరవై రోజుల తర్వాత ఆ కారు వారణాసిలో దొరికింది.
ఫరీదాబాద్లోని బద్కల్కు చెందిన షాహిద్, షివంగ్ త్రిపాఠి లు కారును చోరీ చేసినట్లు గుర్తించారు.
వాస్తవానికి వారు బద్కల్లో కారు నంబరు ప్లేటు ను మార్చి లఖింపూర్ ఖేరీ, బరేలీ, లక్నో మీదుగా వారణాసికి తీసుకెళ్లిపోయారు.
అక్కడ్నుంచి నాగాలాండ్ కు తీసుకెళ్లి అమ్మేందుకు ప్లాన్ చేసినట్లు గా నిందితులు నేరం ఒప్పుకున్నారు.