NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vidadala Rajini : గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి విడదల రజినీ ఆఫీసుపై దాడి
    తదుపరి వార్తా కథనం
    Vidadala Rajini : గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి విడదల రజినీ ఆఫీసుపై దాడి
    గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి విడదల రజినీ ఆఫీసుపై దాడి

    Vidadala Rajini : గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి విడదల రజినీ ఆఫీసుపై దాడి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 01, 2024
    10:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నూతన కొత్త సంవత్సరం నాడు గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

    గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా నిర్మించిన మంత్రి విడదల రజినీ(Vidadala Rajini) కార్యాలయంపై టీడీపీ-జనసేన నాయకులు రాళ్ల దాడి చేశారు.

    దీంతో కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. తర్వాత నడిరోడ్డుపై వైసీసీ జెండాలను తగలబెట్టారు.

    ఈ తరుణంలో కాస్త ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది.

    సమాచారం తెలుసుకున్న పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు.

    ఈ అల్లర్లకు పాల్పడిన కొంతమంది టీడీపీ-జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    Details

    టీడీపీ-జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీసీ ఇంఛార్జిగా మంత్రి విడదల రజనీ నియమితులైన విషయం తెలిసిందే.

    దీనికోసం ఈ నియోజకవర్గంలో కొత్తగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. ఇవాళ ఈ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది.

    ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన కార్యకర్తలు ఈ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.

    దీంతో గుంటూరు వెస్ట్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

    ధ్వంసమైన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి పరిశీలించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విడదల రజినీ

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    విడదల రజినీ

    ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్ సర్కారు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచి ఇంటింటికీ హెల్త్ సర్వే  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025