
Karnataka: కర్ణాటకలో గణపతి ఊరేగింపుపై రాళ్లదాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని మాండ్యా జిల్లా నాగమంగళ పట్టణంలో గణపతి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘటనల్లో పలు దుకాణాలు, వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించాల్సి వచ్చింది.
బదరికొప్పలు గ్రామానికి చెందిన కొందరు గణపతి విగ్రహ నిమజ్జనం కోసం ఊరేగింపుగా వెళుతుండగా, నాగమంగళలోని ప్రధాన రహదారి వద్ద మసీదు సమీపంలో కొందరు రాళ్లు విసిరారు.
Details
లాఠీచార్జ్ చేసిన పోలీసులు
పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికి హిందూ సంఘాలు ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ముందు బైటాయించారు.
మసీదు సమీపంలో ఎక్కువ సమయం గడపడం వల్ల ఈ ఘర్షణ జరిగిందని మాండ్యా జిల్లా ఎస్పీ మల్లికార్జున్ బాలదండి వివరించారు.
ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించి, 163వ సెక్షన్ ప్రకారం ఆంక్షలు విధించారు.