తదుపరి వార్తా కథనం

Stray dogs: బెంగళూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో వీధి కుక్కల దాడి.. ఇద్దరు విద్యార్థినులకు గాయాలు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 12, 2025
05:42 pm
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరు విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో బుధవారం ఉదయం జరిగిన కుక్కల దాడిలో ఇద్దరు మహిళా విద్యార్థినులు గాయపడ్డారు. ఇందులో సౌజన్య జి.జె అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడటంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. ఇక తెలంగాణ నుండి వచ్చిన రెగా నిక్షిత కూడా గాయాలతో చికిత్స పొందుతోంది. ఈ ఇద్దరు విద్యార్థినులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకానామిక్స్ యూనివర్సిటీకి చెందిన ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (ఆర్థికశాజరిస్త్రం) మూడవ సంవత్సరం చదువుతున్నారు. ఈ దాడి ఘటన తీవ్ర ఆందోళనలకు దారితీసింది. గతంలో దేశ రాజధాని దిల్లీలోని కుక్కల సమస్యపై నగర సంస్థలకు సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వీధి కుక్కలను పట్టుకుని, శాశ్వతంగా ఆశ్రయం కల్పించాలని ఆదేశించింది.