LOADING...
CM Chandrababu: సముద్ర భద్రతకు బలోపేతం.. హైస్పీడ్ బోట్లతో గస్తీకి సీఎం ఆదేశాలు
సముద్ర భద్రతకు బలోపేతం.. హైస్పీడ్ బోట్లతో గస్తీకి సీఎం ఆదేశాలు

CM Chandrababu: సముద్ర భద్రతకు బలోపేతం.. హైస్పీడ్ బోట్లతో గస్తీకి సీఎం ఆదేశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2026
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లను వినియోగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి అక్రమంగా సముద్ర జలాల్లోకి బోట్ల చొరబాటు కారణంగా స్థానిక మత్స్యకారులకు నష్టం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం పేర్కొన్నారు.

వివరాలు

నాలుగు హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లు

రాష్ట్ర తీరప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేస్తూ.. బాపట్ల నుంచి సుళ్లురుపేట వరకు ఉన్న ఏపీ సముద్ర జలాల్లో గస్తీని పెంచాలని ఆదేశించారు. దీనిలో భాగంగా మొత్తం నాలుగు హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

Advertisement