Students pass with Jai Shriram: పాసైపోయారుగానీ ఆర్టీఐ ద్వారా అడ్డంగా దొరికిపోయారు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh)కు చెందిన ఫార్మసీ(Pharmacy)విద్యార్థులు(Students)తమ పరీక్ష పత్రాలను భారత క్రికెటర్ల పేర్లను ,జైశ్రీరామ్(Jai Shri Ram)లతో నింపి పాస్ అయిపోయారు.
ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ (Jaunpur) లో ఉన్న వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీ(VBSP) విద్యార్థులు ఇలా శ్రీరామ్,భారత క్రికెటర్ల పేర్లు రాసి పరీక్షల్లో పాసైన ఘటన సమాచార హక్కు చట్టం(RTI) ద్వారా వెలుగు చూసింది.
పరీక్షల్లో వీరిని పాస్ చేసేందుకు యూనివర్సిటీలోని ఇద్దరు ప్రొఫెసర్లు వారి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని కూడా వెల్లడైంది.
ఈ పిల్లలకు ఈ ఇద్దరు ప్రొఫెసర్లు 50% మార్కుల్ని ఉదారంగా ఇచ్చేశారు.
ఈ ఘటన ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేస్తోంది.
VBSP-Exams Pass-Students
ఆర్టీఐ తో వెలుగుచూసిన నిజం
ఆగస్టులో విబిఎస్పి యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు దివ్యాన్సు సింగ్ సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలను తెలుసుకున్నారు.
సదరు విద్యార్థుల జవాబు పత్రాలను మరోసారి మూల్యాంకనం చేయాలని వాటిని బయట పెట్టాలని వారికి రోల్ నెంబర్లను కూడా కేటాయించాలని విద్యార్థి నాయకుడు దివ్యాన్సు సింగ్ సమాచార హక్కు చట్టం ద్వారా డిమాండ్ చేశారు.
దీంతో జవాబు పత్రాలను వర్సిటీ యాజమాన్యం పరిశీలించి చూడగా సదరు విద్యార్థులు జై శ్రీరామ్, హార్దిక్ పాండ్యా ,రోహిత్ శర్మ ల పేర్లతో జవాబు పత్రాలను నింపేసినట్లు వెల్లడైంది.
ఫలితంగా యూనివర్సిటీ యాజమాన్యం ఆ ఇద్దరు ప్రొఫెసర్లను సస్పెండ్ చేసింది.
సస్పెండ్ అయిన ప్రొఫెసర్లు వినయ్ వర్మ,అజయ్ గుప్తాలుగా తేలింది. .
Vandana -VC-VBSP
కమిటీని ఏర్పాటు చేశాం: వీసీ వందన సింగ్
ఈ ఘటనపై యూనివర్సిటీ వీసీ వందన సింగ్ స్పందిస్తూ శ్రీరామ్ అని రాసి ఉన్న జవాబు పత్రాలను ఎంతవరకు చూడలేదని చెప్పారు.
విద్యార్థి నాయకుడు చేసిన ఆరోపణలపై నిజాలు చాలాచాల్సిందిగా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అయితే ఈ కమిటీ సదరు విద్యార్థులకు మరిన్ని మార్కులను వేసిందని తెలిపారు.