AP News: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేపడుతోంది.
ఈ సందర్భంగా ఉపసంఘం సభ్యులు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి, అధికారులతో సమావేశమయ్యారు.
బెంగళూరులో నిర్వహించిన ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణి హాజరయ్యారు.
కర్ణాటకలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం విధివిధానాలపై అధ్యయనం చేశారు.
మంత్రుల కమిటీ కర్ణాటకలో బస్సుల్లో ప్రయాణిస్తూ పథకానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గుమ్మిడి సంధ్యారాణి చేసిన ట్వీట్
*కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం కోసం ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ గారి నేతృత్వంలో బెంగళూరులో పర్యటించడం జరిగింది. కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి గారిని సహా కర్ణాటక ఆర్టీసీ అధికారులతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. హోం, విపత్తు… pic.twitter.com/q6tQjavYo0
— Sandhya Rani Gummidi (@GSandhyarani_) January 3, 2025